తెలంగాణఅక్షరం-వీణవంక
కోర్కల్ మాజీ సర్పంచ్ మర్రి స్వామి యాదవ్ కు మాతృవియోగం కాగా ఆయనను బుధవారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అలాగే కరీంనగర్ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడు నాగరపు సత్యనారాయణ యాదవ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మంచాల రవీందర్, మల్లేష్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నన్నేబోయిన రవి యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు గెల్లు మల్లయ్య యాదవ్, హుజురాబాద్ మండల అధ్యక్షులు బద్దుల రాజకుమార్ యాదవ్, జమ్మికుంట మండల అధ్యక్షులు గిరిజన శ్రీనివాస్, యాదవ్ ఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు అంబరబోయిన రాజు యాదవ్ తదితరులు స్వామియాదవ్ కుటుంబాన్ని పరామర్శించారు.