తెలంగాణఅక్షరం-వీణవంక
కరీంనగర్ జిల్లా మండలంలోని కనపర్తి గ్రామానికి చెందిన గీత కార్మికుడు కోల రాజయ్య ప్రమాదవశాత్తు తన కాలును కోల్పోయాడు. కాగా బాధితుడి కుటుంబ సభ్యులు ఆలయ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ గాదె గుణసాగర్ ను సంప్రదిచారు. దీంతో గుణ సాగర్ ఆలయ ఫౌండేషన్ మార్గదర్శకుడు, ఐఏఎస్ పరికిపండ్ల నరహరి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన భగవాన్ మహావీర్ ట్రస్ట్ సౌజన్యంతో రాజయ్యకు జైపూర్ కాలును అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఐఏఎస్ నరహరితో పాటు గుణసాగర్ కు ధన్యవాదాలు తెలిపారు.
Please follow and like us: