ఏకశిలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

  • తెలంగాణ అక్షరం-హన్మకొండ

ఏకశిలా హై స్కూల్ పెంబర్తి ,హసన్పర్తి, హనుమకొండ నందు ముందస్తు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.విద్యార్థిని విద్యార్థులు అందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి తంగేడు,బంతి, చామంతి, గునుగు, గోరంట తో సహా రకరకాల పూలతో బతుకమ్మలను అలంకరించి ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు.ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హనుమకొండ జిల్లా బిజెపి అధ్యక్షురాలు రావు పద్మ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ( షీ టీమ్స్ ) కె సుజాత, అనురాగ్ హెల్పింగ్ హాండ్ సొసైటీ చైర్మన్ కే యూ  పాలకమండలి సభ్యురాలు శ్రీమతి కె అనితా రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని తెలిపారు. తెలంగాణ పండుగలు మనిషికి మనిషికి మధ్య ఆత్మీయతకు సంబంధించినవి అని కావున మన సాంప్రదాయాలు సంస్కృతులు ముందు తరం కూడా తెలియాలంటే పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి వాటి ఔన్నత్యాన్ని విశిష్టతను తెలుపుతూ వాటి ఉనికిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అని తెలియజేశారు

ఈ సందర్భంగాఅతిథి బిజెపి హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచే బతుకమ్మ పండుగ అని తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక మరియు బంధాలను అనుబంధాలను గుర్తు చేస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగని తెలిపారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ (షీ టీమ్) కే సుజాత మాట్లాడుతూ ఇదో పూల పండుగ ప్రకృతిని పూజించే పండుగ తొమ్మిది రోజులపాటు ఆడి పాడి గౌరీదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మ పండుగ అని తెలిపారు.అనురాగ్ హెల్పింగ్ అండ్ సొసైటీ చైర్మన్ మరియు కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సభ్యురాలు కే అనిత రెడ్డి తెలంగాణ గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించేలా జానపదాలను పాడుతూ ఈ పండుగ జరుపుకుంటున్నారు. ముఖ్యంగా బతుకమ్మ పాటల్లో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబిస్తుంది. పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఒకచోట చేరి ఆడి పాడి సంతోషంగా జరుపుకునే అందమైన అద్భుతమైన పండుగ ప్రపంచంలోనే బతుకమ్మ పండుగ ఒకటే అని చెప్పడం తెలంగాణకే గర్వకారణంఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్స్ జి సువిజా రెడ్డి, ఎం జితేందర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ కే స్వర్ణ రాజ్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు

Please follow and like us:

Check Also

మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

తెలంగాణఅక్షరం-వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన చల్పూరి రవీంద్ర చారి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. కాగా సమాచారం తెలుసుకున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *