Breaking News

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు

టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

 

తెలంగాణ అక్షరం-జగిత్యాల

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ రాష్ట్రవ్యాప్తంగా ఒక జర్నలిస్టు యూనియన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా ఖండించింది. జర్నలిస్టులను మభ్యపెట్టి పక్కదారి పట్టించేందుకు ఆ యూనియన్ చేస్తున్న చర్యలను ఫెడరేషన్ నాయకులు వ్యతిరేకించారు. యూనియన్ చేస్తున్న అనధికారిక కార్యకలాపాలకు మీడియా అకాడమి ఛైర్మన్ మద్దతు ఇవ్వడాన్ని వారు తప్పుపట్టారు. ఆదివారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన టీడబ్ల్యూజేఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఇండ్ల స్థలాల దరఖాస్తుల పేరుతో జర్నలిస్టులను అయోమయానికి గురి చేస్తున్నారని, యూనియన్ పేరుతో దరఖాస్తులు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. జర్నలిస్టుల కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ఆలోచన, చిత్తశుద్ది ప్రభుత్వానికి ఉంటే సమాచార శాఖ ద్వార ప్రక్రియ చేపట్టాలని, లేదంటే అధికారులు,జర్నలిస్టు యూనియన్ల ప్రతినిధులు, సీనియర్ పాత్రికేయులతో కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియా అకాడమి చేయాల్సిన పనులను పక్కన పెట్టి అన్ని పనులు తానే చేస్తామనడం, అందుకు ముఖ్యమంత్రి, మంత్రులు జర్నలిస్టులకు సంబంధించిన అన్ని విషయాలు ఛైర్మన్ కు అప్పగించడం సరైంది కాదని అన్నారు. జర్నలిస్టుల సమస్యల విషయంలో గానీ,మీడియా అకాడమీ నిర్వహణలో గానీ గత ప్రభుత్వంలో జరిగిన తప్పులే ఈ ప్రభుత్వంలో జరగకూడదని, అలా జరిగితే జర్నలిస్టుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని మామిడి సోమయ్య హెచ్చరించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో జర్నలిస్టులు తీసుకోవాలని,సొసైటీలలో లేని అర్హులైన జర్నలిస్టుల జాబితాను ప్రభుత్వం రూపొందించాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల విషయంలో ఒక యూనియన్ చేస్తున్న హడావిడి,తప్పుడు ప్రచారాలతో జర్నలిస్టులు ఆందోళ చెందవద్దని ఆయన కోరారు. గత తొమ్మిదిన్నరేండ్లు టీఆర్ఎస్, బీఆర్ ఎస్ చేసిన మోసాన్ని చవి చూసిన జర్నలిస్టులు ఇక ఎవరు మోసం చేసినా భరించే పరిస్థితిలో లేరని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని మామిడి సోమయ్య విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, బండి విజయ్ కుమార్, గుడిగ రఘు, కార్యదర్శులు తన్నీరు శ్రీనివాస్, బిక్షపతి, కోశాధికారి ఆర్.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యుడు సంజీవరాజు, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు జయపాల్, కోశాధికారి శ్రీనివాస్, నాయకులు కుడితాడు బాపురావు తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

Check Also

సతీష్ కు ప్రణవ్ అభినందన

తెలంగాణఅక్షరం-వీణవంక ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికలల్లో మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన పోతరవేన సతీష్ కుమార్ మండల ఉపాధ్యక్షుడిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *