తెలంగాణ అక్షరం-వీణవంక
భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకుడు పరిపాటి రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్వి నాయకులు మ్యడగోని భరత్, రాపర్తి అరవింద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు చెందిన పేద విద్యార్థులను ఆయన తన సొంత ఖర్చులతో చదివిస్తున్నారని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి నాయకులు యార కుమార్, అంబాల శ్రావణ్, మిడిదొడ్డి సాయిరామ్, మిడిదొడ్డి సాయికుమార్, రాపర్తి అభిలాష్, రాపర్తి సాయి కృష్ణ ,మిడిదొడ్డి అభిలాష్, రాపర్తి నితిన్, అజయ్, వినయ్, యార అజయ్ తదితరులు పాల్గొన్నారు.