తెలంగాణ అక్షరం- జమ్మికుంట
జమ్మికుంట పట్టణం లో నీ సురక్ష మల్టి స్పెషాలిటీ ఆసుపత్రి లో ఓ మహిళకు అరుదైన చికిత్స చేశారు. వైద్యుల కథనం ప్రకారం.. 44 సంవత్సరాల వయస్సు గల ఓ మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ దావఖానకు వచ్చింది. కాగా వైద్యురాలు స్వర్ణలత ఆధ్వర్యంలో వైద్య బృందం ఆమెకు పరీక్షలు నిర్వహించి మహిళ కడుపులో మూడు కిలోల కణతి ఉన్నట్లు గుర్తించి చికిత్స నిర్వహించి తొలగించారు. ఈ సందర్భంగా వైద్యులకు బాధితురాలు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Please follow and like us: