ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

తపస్ మండల అధ్యక్షుడు వడ్లకొండ కుమారస్వామి

క్యాలెండర్ ఆవిష్కరించిన ఉపాధ్యాయులు

తెలంగాణ అక్షరం-హసన్ పర్తి

ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ( తపస్ ) హసన్ పర్తి మండల శాఖ అధ్యక్షుడు వడ్లకొండ కుమారస్వామి డిమాండ్ చేశారు. తపస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వడ్లకొండ కుమారస్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విద్యా విధానాన్ని స్వాగతిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 3 DA లను వెంటనే విడుదల చేయాలని, రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వాలని, పే రివిజన్ కమిషన్ నివేదికను వెంటనేఅమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీ బత్తిని వీరస్వామి గౌడ్, సిద్ధాపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు డి రవి కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *