తెలంగాణ అక్షరం- హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సగర సంఘ సమావేశాలు హైదారాబాద్ సమీపం ఇబ్రహీంపట్నం (నోముల) లోని ఓ ప్రైవేట్ ఫామ్ హౌస్ లో ఆ సంఘం రాష్ట్రఅధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలుత ఆ సంఘం కుల దైవమైన భగీరథ మహర్షి కి పూల మాల వేసి ప్రత్యేక పూజ చేశారు. అనంతరం ఇటీవల మృతి చెందిన వారి ఆత్మ శాంటించాలని కోరుతూ మౌనం పాటించి నివాళులు అర్పించారు. సమావేశం ప్రారంభించారు. తొలుత రాష్ర్ట ఆర్థిక స్థితి గతులపై రాష్ట్ర కోశాధికారి వడ్లకొండ కుమారస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం నివేదిక లు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముత్యాల హరికిషన్, ఆత్మ గౌరవ ట్రస్టు చైర్మన్ ఆస్కాని మారుతి సాగర్, ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం, కోశాధికారి వడ్లకొండ కుమారస్వామి, మహిళా విభాగం అధ్యక్షురాలు గాండ్ల స్రవంతి, యువజన విభాగం అధ్యక్షుడు మార్క సురేష్, రాష్ట్ర కార్యవర్గం, కరీంనగర్, హన్మకొండ జిల్లాల ప్రధాన కార్యదర్శులు కట్ట రాజు, కాటిపెల్లి కుమారస్వామి, కుర్మిండ్ల కుమారస్వామి, మంగనూరి రఘు, నాయకులు కానిగంటి శ్రీనివాస్, కుర్మిండ్ల రాజు, జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.