- రిటైర్డ్ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ
- తల్లిదండ్రుల కలలకు నిలయాలు విద్యాసంస్థలు
- ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి
- ఘనంగా ఏకశిలా పాఠశాలల వార్షికోత్సవ వేడుకలు
వివేకవంతమైన విద్యార్థులే దేశానికి బలం, బలగమని రిటైర్డ్ సీబీఐ జేడీ, జేడీ ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ అన్నారు. ఏకశిల గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వార్షికోత్సవ వేడుకలను పెంబర్తి క్రాస్ రోడ్ ఏకశిలా టెక్నో స్కూల్, హసన్పర్తిలో ఆ విద్యా సంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి అధ్యక్షతన సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి 3 లక్ష్యాలను కలిగి ఉండాలని ఒకటి తల్లిదండ్రులు తనను చూసి గర్వపడే స్థాయికి ఎదగాలని, రెండోది తాను చదువుకున్న పాఠశాలకే అతిథిగా రావాలని, మూడోది తమ సంతకం ఆటోగ్రాఫ్ గా మారాలని తెలిపారు. టెక్నాలజీ మనల్ని ఆడించడం కాదు మనమే టెక్నాలజీని ఆడించాలని జ్ఞానార్జన అన్నది ఒక రోజుతో అగకుండా ప్రతినిత్యం ఉండాల్సిందే అని తెలిపారు. మారుతున్న ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులు తమ గమ్యాన్ని ముందే నిర్దేశించుకుని దానికి అనుగుణంగా కష్టపడుతూ క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు. సంస్కారం, విలువలతో కూడిన విద్యను అభ్యసించినప్పుడే తాను ఏ రంగంలో ఉన్నా కూడా ఆ రంగంలో గొప్ప వ్యక్తిగా తయారవుతారని తెలిపారు. ప్రతి విద్యార్థి ఆలోచన విధానంలో మార్పు రావాలని, అందరిలాగా కొత్తగా సృజనాత్మకతతో ఆలోచించాలని తెలిపారు.
ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ మా విద్యార్థిని విద్యార్థులకు విలువలతో కూడా విద్యను అందిస్తున్నామని, ప్రతి విద్యార్థిలో ఉన్నటువంటి నిగూఢమైన నైపుణ్యాన్ని వెలికి తీయడానికి మా ఉపాధ్యాయ బృందం ఎల్లవేళల కృషి చేస్తుందని, తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తును ఎంతో నమ్మకంతో మా ఏకశిల విద్య సంస్థలో ఉంచారని వారి యొక్క నమ్మకాన్ని, ఆశలను, ఆశయాలను నెరవేర్చుటలో మా ఏకశిలా యాజమాన్యం వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. విద్యార్థులు తామేంచుకున్న రంగంలో విశ్వసనీయతను కలిగి ఉండాలని అప్పుడే ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. పదో తరగతిలో జీపీఏ 10/10 సాధించిన, సీబీఎస్ఈలో 475 పైగా సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఏకశిల జూనియర్ కళాశాలలో ఉచిత విద్యను ఇస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్లు గౌరు రాజి రెడ్డి, బేతి కొండల్ రెడ్డి, గౌరు సువిజ తిరుపతి రెడ్డి, ముచ్చ జితేందర్ రెడ్డి, విద్యాసంస్థల ప్రధానోప్యాయులు చిదురాల దినేష్ రెడ్డి , బేతి శైలజ రెడ్డి, ముచ్చ స్వప్న రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.