- ప్రతీ ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలి
- ప్రమాద బీమాగా రూ.2లక్షలు అందజేత
- బీమా కంపెనీకి మూడో విడత డబ్బులు రూ.12,02,775 చెల్లింపు
- తెలంగాణ సగర సంఘం రాష్ర్ట అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, కోశాధికారి వడ్లకొండ కుమారస్వామి సగర
తెలంగాణఅక్షరం-హైదరాబాద్
తెలంగాణ రాష్ర్ట సగర సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కుల జనగణనతో సగరులకు ఆర్థిక భరోసా లభిస్తుందని, ప్రతీ ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని తెలంగాణ సగర సంఘం రాష్ర్ట అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర అన్నారు. తెలంగాణ రాష్ర్ట సగర సంఘం ఆధ్వర్యంలో తీసుకున్న మహత్తర నిర్ణయం మేరకు కుల జనగణన ద్వారా సభ్యత్వం స్వీకరించిన సగర బంధువులందరికీ మొదటి, రెండో సంవత్సరం అనంతరం మూడో సంవత్సరం కూడా బీమా మొత్తానికి రాష్ట్ర సంఘం నుండి మంగళవారం ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా జనవరి 26 నుంచి ఈ సంవత్సరం 27-01-2025 వరకు రెండు సంవత్సరాల కాలం పాటు ప్రమాద బీమా పథకం కొనసాగిందని పేర్కొన్నారు. అలాగే మరో సంవత్సరం పాటు ఈ పథకాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర సంఘం ఖాతా నుంచి రూ.12,02,775 యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించి రెన్యువల్ చేసినట్లు తెలిపారు. గత రెండు సంవత్సరాల కాలంలో ఈ పథకంలో సభ్యులైన మన సగర బంధువులకు ఇప్పటికే కొందరికి ఇన్సూరెన్స్ ద్వారా రూ.2లక్షలు లబ్ధి పొందినట్లు వివరించారు.
మృతి చెందిన 14 కుటుంబాలకు రూ.2లక్షలు
గత రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించిన జనగణన అనే మహత్తర కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న వేలాది కుటుంబాలకు రాష్ట్ర సంఘం ఒక బరోసా కల్పించింది. రూ.300, రూ.2000ల బీమాతో కూడిన సభ్యత్వం పొందిన సగరులకు ఆర్థిక చేయూత అందించే పథకాన్ని అమలు చేస్తోంది. ప్రమాద వశాత్తు (యాక్సిడెంటల్) గా మరణించిన సభ్యుని కుటుంబానికి రూ.2లక్షలు ఆర్థిక చేయూత అందించే పథకాన్ని కొనసాగిస్తోంది. రాబోయే ఏడాది కాలం పాటు కూడా సంఘములో ప్రమాద బీమా తో కూడిన సభ్యత్వం స్వీకరించిన ప్రతీ సభ్యుడికి ఈ పథకం వర్తిస్తుంది. కావున ఇప్పటికైనా అన్ని జిల్లాలలో ఉన్న సగర బంధువులు కుల జనగణన ద్వారా సభ్యులుగా చేరి ఈ పథకానికి అర్హత పొందాలని తెలంగాణ సగర సంఘం రాష్ర్ట అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, గౌరక్క సత్యం సగర, కోశాధికారి వడ్లకొండ కుమారస్వామి సగర కోరారు.