టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు గడ్డం రాజిరెడ్డి
ఘనంగా టీయూడబ్ల్యూజేే 2025 డైరీ ఆవిష్కరణ
తెలంగాణ అక్షరం -హన్మకొండ
జర్నలిస్టుల సమస్యల సాధనకు కృషి చేస్తామని, జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమమే ద్యేయంగా టీయూడబ్ల్యూజేే (ఐజేయూ) ముందుకు సాగుతున్నదని టీయూడబ్ల్యూజేే (ఐజేయూ) జిల్లా అధ్యక్షులు గడ్డం రాజిరెడ్డి తెలిపారు.గురువారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ లు సాధించేందుకు కృషి చేస్తామని అన్నారు.అక్రిడేషన్ లపై జరుగుతున్న దుష్ర్పచారం జర్నలిస్టులు నమ్మవద్దని కోరారు. అలాగే హెల్త్ కార్డుల సాధనకు కృషి చేస్తున్నామని అన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కారం దిశగా పాటుపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారం సదయ్య, యూనియన్ జాతీయ నాయకులు దాసరి కృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గాడేపల్లి మధు, హౌజింగ్ రాష్ట్ర కన్వీనర్ వల్లాల వెంకటరమణ, రాష్ట్ర నాయకులు కంకణాల సంతోష్,గడ్డం కేశవమూర్తి, పి. శివ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్, నల్లాల బుచ్చిరెడ్డి, పి. విష్ణు వర్దన్, ఎండి నయీం పాషా, గన్ను సంతోష్, రంజిత్, కార్యవర్గ సభ్యులు పులికంటి రాజేందర్, దండు మోహన్, ఎం. ఓదెలు,వాజిద్, టి. రవి, పి. రామారావు,ఖాదర్ పాషా పాల్గొన్నారు.