నేత్ర వైద్యుడు గుండేటి గణేష్
రెడ్డిపల్లిలో సగర సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
తెలంగాణఅక్షరం-వీణవంక
సగర సంఘం సేవలు అభినందనీయమని హన్మకొండ పట్టణానికి చెందిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ గుండేటి గణేష్ అన్నారు. సగర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు కోరిక మేరకు మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలోని సగర సంఘ కార్యాలయంలో సగర సంఘం నేతృత్వంలో హన్మకొండలోని గణేస్ ఐ కేర్ అండ్ ఆఫ్టికల్స్, సాయితేజ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ సగర, ప్రధాన కార్యదర్శి కట్ట రాజు సగర, కోశాధికారి కాటిపెల్లి కుమారస్వామి (బాబు), సగర సంఘం గ్రామ కమిటీ ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గణేష్ ఆధ్వర్యంలో గ్రామంలోని సగర కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు 60 మంది కంటి పరీక్షలు నిర్వహించి మాట్లాడారు. కంటి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పలువురికి శస్ర్త చికిత్సలు అవసరమని గుర్తించారు. వారికి ఉచితంగా హైదరాబాద్లో ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కాగా వీరికి ఉచిత రవాణాతో పాటు భోజన సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. సగర సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలను ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ గ్రామానికి నూతనంగా రాగా వారిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం రెడ్డిపల్లి, శ్రీరాములపేట గ్రామ శాఖల అధ్యక్షులు కట్ట శ్రీనివాస్ సగర, దేవునూరి రాజేందర్ సగర, రెడ్డిపల్లి గౌరవ అధ్యక్షుడు కట్ట మల్లేష్ సగర, రాష్ట్ర సగర సంఘం మహిళా విభాగం కార్యవర్గసభ్యురాలు కుర్మిండ్ల జ్యోతి సగర, కమిటీ సభ్యులు కట్ట అశోక్, కుర్మిండ్ల మల్లయ్య, కట్ట నవీన్, కట్ట శ్రీనివాస్, కట్ట కుమార్, కట్ట శ్రీధర్, కుర్మిండ్ల సదయ్య, కుర్మిండ్ల స్వామి, కుర్మిండ్ల జనార్ధన్, కుర్మిండ్ల నాగరాజు, లడ్డూ, కుర్మిండ్ల శేఖర్ తో పాటు మహిళలు తదితరులు పాల్గొన్నారు.