తెలంగాణఅక్షరం-వీణవంక
తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ఆధ్వర్యంలో 16న నాగర్ కర్నూల్ లోని జిల్లా పరిషత్ మైదానంలో నిర్వహించతలపెట్టిన సగర శంఖారావం విజయవంతం చేయాలని తెలంగాణ సగర సంఘం జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు సగర, జిల్లా కోశాధికారి కాటిపెల్లి కుమారస్వామి సగర కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్ర ్యం సిద్ధించిన నాటి నుండి నేటి వరకు పాలకులు మనల్ని గుర్తించకపోవడం చాలా శోచనీయమని పేర్కొన్నారు. కావున ఈ బహిరంగ పాలకులకు కనువిప్పు కలిగేలా ప్రతి సగరుడు స్వచ్ఛందంగా కదలిరావాలని కోరారు. ఈ బహిరంగ సభ ధ్వారా అన్ని రాజకీయ పార్టీలకు కనువిప్పు అయ్యే విధంగా సగరులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. సగరులను బీసీ-డీ నుండి బీసీ-ఏలోకి మార్చాలని, సగర ఫెడరేషన్ ను కార్పొరేషన్ గా మార్చాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 59ను సవరణ చేసి సగరులకు రిజర్వేషన్స్ సంఖ్య పెంచాలని, స్థానిక సంస్థల్లో సగరులకు అధిక సీట్లు ఇవ్వాలని రాజకీయ పార్టీలను కోరారు. అలాగే కార్మిక సంక్షేమ మండలి ఏర్పాటు చేసి సగరులను చైర్మన్ గా నియమించాలని, బీసీల పాలిట శాపంగా మారిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సవరించాలని డిమాండ్ చేశారు.