తెలంగాణఅక్షరం-వీణవంక
వీణవంక మండల కేంద్రానికి చెందిన ట్యురిటో సంస్థల అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట మండలాల్లోని కస్తూర్బా గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పరీక్ష ప్యాడ్లు, పెన్నులు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఉదయ్ నందన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాళ్లపెళ్లి కుమారస్వామి, దాసారపు లోకేష్, వంశీకృష్ణ, మంతెన శ్రీధర్, తొట్ల రాకేష్, మహంకాళి రాజు, కోరె రాకేష్, జమ్మికుంట, ఇల్లంతకుంట, కస్తూర్బా పాఠశాలల ఎస్ వోలు తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us: