‘రాజీవ్ యువ వికాసం’ ను సద్వినియోగం చేసుకోవాలి

 

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి

తెలంగాణ అక్షరం-వీణవంక

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నరాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిందని, అర్హులైన నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతకు రూ.4 లక్షల వరకు ఆర్ధిక సహాయం అందిస్తుందన్నారు. ఏప్రిల్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. లోన్ మొత్తాన్ని బట్టి 60 నుంచి 80 శాతం వరకు ప్రభుత్వ సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి జూన్ 2 న రాయితీ రుణాలను మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *