ఆశల అరెస్టును ఖండించిన
జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి.
వీణవంక :
హైదరాబాద్ లో నిరసన కార్యక్రమానికి బయలుదేరిన ఆశ కార్యకర్తలని రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఎక్కడికి అక్కడ అరెస్టు చేయడాన్ని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి తీవ్రంగా ఖండించారు. మంగళవారం వీణవంకలో ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు నెలకు రూ.18 వేల జీతం, ఈఎస్ఐ, పిఎఫ్, రిటైర్డ్ బెనిఫిట్స్ తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు.రాష్ట్రంలో ప్రజలతోపాటు ఉద్యోగులు నిరసన తెలిపే హక్కులను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఆశల పక్షాన వాసు వడ్లూరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.