కొంపల్లి పట్టణ పారిశుద్ధ కార్మికుల సేవలు వెలకట్టలేనివి -పెద్దబుద్దుల సతీష్ సాగర్
మున్సిపాలిటీ కార్మికులకు టోపీలు ఇవ్వడం అభినందనీయం – కొంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ కృష్ణారెడ్డి
తెలంగాణ అక్షరం -కుత్బుల్లాపూర్
రాబోయే ఎండాకాలంలో పారిశుద్ధ కార్మికులు ఎండ తీవ్రతకు తట్టుకొనేందుకు వీలుగా సంకల్ప్ ఫౌండేషన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు టోపీలను అందచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ కృష్ణరెడ్డి , బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండలకు రక్షణగా మున్సిపాలిటీ కార్మికులకు టోపీలు ఇవ్వడం అభినందనీయం, సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సతీష్ సాగర్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. అనంతరం సతీష్ సాగర్ మాట్లాడుతూ కొంపల్లి పట్టణ పారిశుద్ధ కార్మికులు మన పరిసరాల పరిశుభ్రతకు చేస్తున్న కృషి వెలకట్టలేనివి, రాబోయేది ఎండాకాలం, వడదెబ్బకు గురికాకుండా పరిశుద్ద కార్మికులు తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు. టోపీల పంపిణీలో భాగంగా భోజన వితరణ అనంతరం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ శాఖలకు సంబంధించిన 220 మంది పరిశుద్ద కార్మికులకు టోపీలను అందచేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జనార్ధన్ రెడ్డి, సరిత, శివాజీ రాజు, అశోక్, మాధురి, దుర్గ, మధు, సంకల్ప్ ఫౌండేషన్ సభ్యులు శ్రీకాంత్ గౌడ్, మహేందర్ సాగర్, మల్లికార్జున్, మురళీకృష్ణ, తిరుపతి, శ్రీకాంత్ మున్సిపాలిటీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీ కార్మికులకు టోపీల పంపిణీ
Please follow and like us: