తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్
వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందయమని బాలాజీ లేఅవుట్ స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకులు కృష్ణ అన్నారు. ఆదివారం గాజులరామారంలో ని ప్రధాన రోడ్డులో ఈగల్ వారియర్స్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా కృష్ణ పలువురు కాలనీవాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చిన ఈగల్ వారియర్స్ సభ్యులను అభినందించారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు సైతం చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

చలివేంద్రం ప్రారంభం
Please follow and like us: