స్ధానిక సంస్థల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేన్ల పై పాలకులకు చిత్తశుద్ది లేదు

ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు.
తెలంగాణ అక్షరం – హుజురాబాద్
కుల గణన ఆధారంగా రాష్ట్రం లో స్ధానిక సంస్థల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ లో ఆమోదించిన బిల్లుపై పాలకులకు చిత్తశుద్ది లేదని, కేవలం రాజకీయ పబ్బం గడుపుకునే కంటి తుడుపు చర్యలు మాత్రమే నని ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామా రావు ఆరోపించారు. మంగళవారం హుజురాబాద్ లో మీడియా ప్రతినిధులతో పోలాడి రామారావు మాట్లాడారు.
బీసీల రిజర్వేషన్ల పై చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును రాష్ట్ర గవర్నర్ దగ్గర లా సెక్రటరీ, అడ్వకేట్ జనరల్ యితర న్యాయ నిపుణుల ద్వారా బలమైన డాక్యుమెంట్ తో ప్రభుత్వ పాలకులు వాదనలు వినిపించి గవర్నర్ ద్వారా ఆమోదింప జేస్తే ఇక్కడ బీసీ రిజర్వేషన్ల బిల్లు చట్ట రూపం దాల్చుదుందని ఈ చట్టం ద్వారా ముందుగా ఇక్కడ బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేసి వెంటనే స్ధానిక ఎన్నికలు నిర్వహించవచ్చని రామారావు అభిప్రాయ పడ్డారు. అలా కాకుండా అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపుదామనే కాలయాపన తో కేంద్రం పై బూచీతో కుంటి సాకులు చూపడమేనని అన్నారు.
గవర్నర్ ద్వారా ఆమోదింపజేసి ఇక్కడే చట్ట రూపం దాల్చిన రిజర్వేషన్లను వెంటనే ఇక్కడ స్ధానిక సంస్థల్లో కేవలం గ్రామీణ ప్రాంతాలలో కాకుండా, పట్టణ ప్రాంత ఎన్నికల్లో కూడా వెంటనే అమలు చేసి ప్రభుత్వ పాలకులు నిజాయితీ గా చిత్త శుద్ధి నిరూపించుకోవాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలలో పాలన పడకేసిందని కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా సకాలంలో స్తానిక ఎన్నికలు నిర్వహించనీ కారణంగా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్ దగ్గర వాదనలు వినిపించక పోతే ఆయన ద్వారా కేంద్రానికి ఇట్టి బిల్లు ఇప్పట్లో చేరడం అసాధ్యమని, ఆయన న్యాయ నిపుణులతో చర్చలు జరపకుండా బిల్లుపై నిర్ణయం తీసువాలంటే ఏళ్ల తరబడి కాలయాపన జరిగి కోల్డ్ స్టోరేజ్ లో మూలన పడడం ఖాయమని నిపుణులు అభిప్రాయపుతున్నారని రామారావు అన్నారు. ఇక్కడ గవర్నర్ ద్వారా ఆమోదించి చట్ట రూపం దాల్చిన తర్వాత బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే ఎదురయ్యే ఇబ్బందుల పైఅవసరమైతే బలమైన డాక్యుమెంట్ల ద్వారా కోర్టుల్లో ప్రభుత్వం వాదించ వచ్చని అప్పటికే సమస్య పరిష్కారం కాకుంటే కేంద్ర ప్రభుత్వానికి పంపి బీ సీ రిజర్వేషన్ల అమలుకు
డిమాండ్ చేయాలని రామారావు సూచించారు.
దేశవ్యాప్తంగా 2011 లో నిర్వహించిన కుల గణన లెక్కలు కేంద్రం బయట పెట్టీ అట్టి కులగనణ ఆధారంగా దేశవ్యాప్తంగా బీసీ లకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఆమోదించి చట్టం చేసి కేంద్ర ప్రభుత్వం నిజాయితీని చాటాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ పై డిల్లీలో ఆందోళన చేస్తే సమంజసంగా ఉంటుందన్నారు.

 

Please follow and like us:

Check Also

పెంచిన పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలి

సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్‌ గ్యాస్‌ సిలిండర్‌తో కరీంనగర్‌లో నిరసన తెలంగాణఅక్షరం- కరీంనగర్‌ కేంద్ర ప్రభుత్వం పెంచిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *