ఏడో రోజుకు చేరిన భద్రాచలం మహా పాదయాత్ర

తెలంగాణఅక్షరం-ఖమ్మం
భాగ్యనగరం నుండి భద్రాచలం వరకు తెలంగాణ రాష్ట్ర సగర సంఘం యువజన విభాగం అధ్యక్షుడు మర్క సురేష్ సగర చేపట్టిన మహా పాదయాత్ర బుధవారం నాటికి ఏడో రోజుకు చేరింది. ఈ యాత్ర ఏడో రోజు ఖమ్మం జిల్లాలో ప్రవేశించగా ఆ జిల్లాకు చెందిన సగరులు ఈ సందర్భంగా సురేషన్‌ ను పూలమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సురేష్‌ సగర మాట్లాడుతూ తాము భగీరథ మహర్షి, శ్రీరాముని వంశీయులమని, భద్రాచలంలోని రాములవారి కళ్యాణానికి తామే తలంబ్రాలు అందించేలా ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్‌ చేశారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తలంబ్రాలతో పాదయాత్ర చేపట్టి రాముని చెంతకు తలంబ్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తాను చేపట్టిన యాత్రకు సగరుల నుండి భారీ ఎత్తున స్పందన వస్తున్నదని, ఈ యాత్రకు మద్దతునిస్తూ ప్రోత్సహిస్తున్న సగర బంధువులకు కృతజ్ఞతలు తెలిపారు.

Please follow and like us:

Check Also

పెంచిన పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలి

సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్‌ గ్యాస్‌ సిలిండర్‌తో కరీంనగర్‌లో నిరసన తెలంగాణఅక్షరం- కరీంనగర్‌ కేంద్ర ప్రభుత్వం పెంచిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *