- పోలీస్ నిర్బంధాన్ని అక్రమ అరెస్టులను ఖండిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసన
- అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
- CPM జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి
తెలంగాణఅక్షరం-కరీంనగర్
యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టకూడదని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సిపిఎం నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ… సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌక వద్ద జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గుడికందుల సత్యం పోలీస్ వేషధారణలో నాయకులకు సంకెళ్లు వేసి లాక్కెళ్తూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా పాలన సాగడం లేదని ప్రభుత్వ అధికార యంత్రాంగం పోలీసులను ఉసిగొల్పుతూ నాయకుల ఇళ్ళ లోకి వెళ్లి అరెస్ట్ చేయడం, పోరాటాలు చేస్తున్న నాయకులను నిర్బంధించడం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ సి యూ భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే విధంగా రాత్రికి రాత్రే అడవులను తగలబెట్టడం మూలంగా వన్యప్రాణులు, జీవచరాలు మరణించాయని, యూనివర్సిటీ కి చెందిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు అమ్ముకుంటుందని గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు.
6 గ్యారంటీల అమలు చేస్తామని, ఏడవ గ్యారెంటీగా ప్రజాపాలన కొనసాగిస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ శాంతియుతంగా చేస్తున్న ప్రజా ఉద్యమాలను అణిచి వేస్తూ, నాయకులను నిర్బంధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, యూనివర్సిటీ భూములను పరిరక్షించేంతవరకు ఉద్యమాన్ని ఉధృతం చేసి అనేక విధాలుగా పోరాటాలు చేస్తామని అన్నారు. గతంలో విద్యార్థులకు ఇచ్చిన భూములను ఏ విధంగా లాక్కుంటారని ప్రశ్నించారు. యూనివర్సిటీ భూములపై పోరాడుతున్న విద్యార్థి సంఘం నాయకులను అరెస్ట్ చేసి అక్రమ కేసులు బనయించారని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో నాయకులను ఇళ్లలోకి వెళ్లి ఉద్యమాన్ని అంచి వేసే విధంగా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా విద్యార్థుల చెందవలసిన భూములను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విద్యార్థులకు కేటాయించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు లేదంటే ప్రజా సంఘాలను, వామపక్ష వాదులను కలుపుకొని పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గీట్ల ముకుంద రెడ్డి, గుడికందుల సత్యం, జీ.బీమాసాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు యు. శ్రీనివాస్, సుంకర సంపత్, నరేష్ పటేల్, జి.రాజేశం, నాయకులు శనిగరపూ రజనీకాంత్, గజ్జల శ్రీకాంత్, జీ.తిరుపతి, కాంపెల్లి అరవింద్, రాయికంటి శ్రీనివాస్, పుల్లెల మల్లయ్య, రత్నం సురేష్, రత్నం రమ్య,బోగేష్ తదితరులు పాల్గొన్నారు.