- యాత్రకు సంఘీభావం తెలిపిన పలువురు సగర నాయకులు
తెలంగాణఅక్షరం-హన్మకొండ
శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ రాముడి కల్యాణం కోసం పట్టు వస్ర్తాలు, తలంబ్రాలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర యువజన సగర సంఘం అధ్యక్షులు మర్క సురేష్ సగర భాగ్యనగరం నుండి భద్రాచలం వరకు చేపట్టిన పాదయాత్ర గురువారం నాటికి ఎనిమిదో రోజుకు చేరింది. కాగా ఈ యాత్ర 250కి.మీ పూర్తి చేసుకుని ఖమ్మ జిల్లాలోని ఏన్కూరు చేరింది.
కాగా ఈ పాదయాత్రకు సంఘీభావంగా తెలంగాణ రాష్ట్ర సగర సంఘం రాష్ట్ర కోశాధికారి వడ్లకొండ కుమారస్వామి సగర రూ.5,016, కరీంనగర్ జిల్లా సగర సంఘం ప్రధాన కార్యదర్శి కట్ట రాజు సగర రూ.1,116 సురేష్ సగరకు అందజేశారు. ధృడ సంకల్పంతో అపర భగీరథ ప్రయత్నం చేస్తూ శ్రీరాముని వారసులం తామేనని నిరూపించేందుకు ఈ యాత్ర చేపట్టడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
అలాగే సురేష్ చేపట్టిన యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని కోరారు. శ్రీరాముని వారసులు సగరులేనని, కావున మా ఇలవేల్పు అయిన శ్రీరాముడి కల్యాణానికి పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు, ఓడిబియ్యం, సగరులచేతనే సమర్పించే విధంగా అధికారికంగా ప్రకటించాలని, ఇందుకోసం ప్రత్యేక జీవో తీసుకురావాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.