తెలంగాణ అక్షరం- హసన్ పర్తి
స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలను బోధించారు. తాము కూడా భవిష్యత్తులో ఉపాధ్యాయులుగా ఉద్యోగం సాధిస్తామని విద్యార్థులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చాడ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే క్రమశిక్షణతో చక్కగా చదువుకోని జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని అలాగే ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉమారాణి, దేవమ్మ, పున్నంచందర్, శ్రీకాంత్, రేవతి, కిషన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us: