తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్
శ్రీరామనవమి వేడుకల సందర్భంగా గాజులరామారంలో ఆలయాలను నిర్వాహకులు అందంగా ముస్తాబు చేశారు. ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చి దేవతామూర్తులను దర్శించుకుంటున్నారు. సీతారాముల కళ్యాణం కోసం ఉత్సవ గ్రహాలను ఊరేగింపుగా ఆలయాలకు తీసుకువచ్చారు. భాజా భజంత్రీలు, వేద మంత్రోచ్ఛా రణల మధ్య తలంబ్రాలతో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తుల రాకతో ఆలయ పరిషత్ ప్రాంతాలు కిటకిటలాడాయి. స్వాగత తోరణాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు కల్యాణంలో పాల్గొన్నారు. రామనామ స్మరణతో ఆలయాలు మారుమోగాయి. సూరారం డివిజన్ పరిధిలోని పలు ఆలయాలలో జరిగినటువంటి స్వామివారి కల్యాణోత్సవంలో ఎన్ఎస్ యుఐ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కూన రాఘవేందర్ గౌడ్ పాల్గొని దేవత మూర్తుల ఆశీర్వాదాలు అందుకున్నారు. పలు ఆలయాలలో నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
Please follow and like us: