కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం
జైశ్రీరామ్ నినాదంతో శోభాయాత్ర
తెలంగాణ అక్షరం – బాలాపూర్
శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఇంటా ప్రతినోటా శ్రీరామ నామస్మరణనే వినిపించింది. వీధి వీధిన సీతారాముల కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా భక్తులు నిర్వహించారు. బాలాపూర్ మండల పరిధిలోని బాలాపూర్, బడంగ్పేట్, మీర్పేట్, అల్మాస్గూడ, గుర్రం గూడా, నాదర్గుల్ తదితర గ్రామాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను కళ్ళకు కట్టినట్టు వేద పండితుల మంత్రోచరణాల మధ్య ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల రద్దీతో ఆలయాలన్ని కిటకిటలాడాయి.
జైశ్రీరామ్ నినాదంతో శోభాయాత్ర :
బడంగ్పేట్ పరిధిలోని దేవతలగుట్ట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం శోభయాత్ర భారీగా కొనసాగింది. బడంగ్పేట్ సర్కిల్లో పులిహోర, మజ్జిగ, నీళ్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం కాషాయ జెండాలు చేతిలో పట్టుకొని, జై శ్రీరామ్ నినాదాలతో ఊరేగింపుగా బాలాపూర్ మీదుగా దేవతల గుట్ట వరకు శోభయాత్ర నిర్వహించారు. దేవతలగుట్టపై సీతారామచంద్ర స్వాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో దేవతలగుట్ట పరిరక్షణ సమితి అధ్యక్షలు మంత్రి మహేష్ ముదిరాజ్, సభ్యులు కందికంటి రాజు గౌడ్, తర్రే కుమార్, మన్నే మురళి కృష్ణ, నీరజవెల్లి యాదయ్య, హన్మంత్ రావు, ఇల్లందుల సాయి సంతోష్, మేల పవన్ కుమార్, సిద్ధాం శివ, పిట్టల శ్యామ్, గుమ్మడి రవికాంత్, అరుణ్ గౌడ్, గట్టు మహిపాల్, గోవుల వినోద్, బంధ్యాల శంకర్ రెడ్డి, తది తరులు పాల్గొన్నారు.