తెలంగాణ అక్షరం – బాలాపూర్
బాలాపూర్ మండల పరిధిలోని నాగర్గుల్ గ్రామంలో గురువారం పొదుపు సంఘం డబ్బులను పంపిణీ చేయడం జరిగింది. మహేంద్ర మేదరి యువజన సంఘం బాలాపూర్ మండల అధ్యక్షుడు తోకల లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయగా, సంఘంలో జమ ఉన్న రూ. 3 లక్షల 43 వేలను ఎడుగురి సభ్యులకు ఒకొక్కరికి రూ.49 వేలను పంపిణీ చేశారు. ఈ మొత్తాన్ని మూడు నెలల తర్వాత తిరిగి కట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. యువకులు పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని, మనం చేసే కాస్తంత పొదుపు ఏదో అవసరానికి ఉపయోగపడుతుందని అధ్యక్షులు లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, కోశాధికారి తోకల రవీందర్, ప్రచార కార్యదర్శి జొరిగే రమేష్, సభ్యులు టి.గోవర్ధన్, వి భాస్కర్, ఎస్.హరీష్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.