జ్యోతిబా ఫూలే గారి జీవిత సూత్రాలను ఆదర్శంగా తీసుకుందాం – కొంపల్లి బీజేపీ అధ్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్
తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్
ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిబా ఫూలే జన్మదినం పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు పెద్దబుద్దుల సతీష్ సాగర్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా కన్వీనర్ డా. మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శులు గిరివర్ధన్ రెడ్డి, విఘ్నేష్, ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, కౌన్సిల్ సభ్యులు జనార్ధన్ రెడ్డి , అసెంబ్లీ కోకన్వినర్ శివాజీరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫూలే చిత్రపటానికి పూలమాలలు సమర్పించి జై ఫూలే నినాదాలతో నివాళులు అర్పించారు. అనంతరం సతీష్ సాగర్ మాట్లాడుతూ మహాత్మ బిరుదాంకితులు, సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకులు, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ ను ఏర్పాటు చేసి, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణ కాంక్షతో, మహిళా విద్యావస్థకు కృషిచేసిన జ్యోతిరావు పూలే అడుగుజాడలలో నడుస్తూ, ఈ సమాజానికి మన వంతు సేవ చేయాలనేది మన ప్రధాని మోదీ సంకల్పం, వారు కలలు కన్న సమాజం నిర్మాణం కోసం శక్తిమేర కృషిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా , డివిజన్ స్థాయి ముఖ్య నాయకులు దుర్గ అశోక్, శంకర్ నాయక్, చక్రధర్, నర్సింగ్ రావు, మధు, శ్రీనివాస్, మహేందర్ సాగర్, శ్రీకాంత్, రఘు, మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.