నాగపూర్ బయలుదేరిన మహేంద్ర బృందం
తెలంగాణ అక్షరం – బాలాపూర్
ఏప్రిల్ 12 ,13 తేదీలలో మహారాష్ట్ర నాగపూర్ లో జరిగే అఖిల భారతీయ మేదరి మహేంద్ర సంఘం ప్రతినిధుల సమావేశానికి తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం బృందం శుక్రవారం బయలుదేరి వెళ్ళింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బీసీలో ఉన్నటువంటి మన మేదరులను ఎస్టీలో కలపాలనే ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం కోసం అఖిల భారతీయ సమావేశంలో మద్దతు కూడా కట్టే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి బయలుదేరుతున్నామని రాష్ట్ర అధ్యక్షులు జోరీగల శ్రీనివాస్ తెలిపారు. బయలుదేరిన తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం బృందంలో అఖిల భారతీయ అధ్యక్షులు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కే.వెంకట రాముడు, శారదమ్మ,రాష్ట్ర అధ్యక్షులు జొర్రిగల శ్రీనివాస్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ప్యారసాని రమాకాంత్, వెదురు పారిశ్రామిక సహకార సంఘాల ప్రధాన కార్యదర్శి ప్యారసాని హనుమంతు, ఉద్యోగ సంఘం నాయకులు మదిరే నాగరాజు తదితరులు ఉన్నారు.

నాగపూర్ బయలుదేరిన మహేంద్ర బృందం
Please follow and like us: