తెలంగాణ అక్షరం – బాలాపూర్
శ్రీరాముని చిత్రపటాన్ని చించి హిందూ మనోభావాలను అవమానించే విధంగా ప్రవర్తించిన బడంగ్‌పేట్ మున్సిపల్ సిబ్బందిపై చర్య తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పాత గ్రామపంచాయతీ సర్కిల్ వద్ద శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీరాముని పటాన్ని మున్సిపల్ సిబ్బంది చించి వేశారని బీజేపీ బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే శ్రీరాముని చిత్రాన్ని చించడమేంటంటే హిందూ ధర్మంపై కుట్ర అని, ఇది మతప్రతీకలపై అవమానకరమైన దాడని పేర్కొన్నారు. ఇటువంటి దుర్మార్గ చర్యలను బీజేపీ నిక్కచ్చిగా ఎదుర్కొంటుందని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే పెద్ద ఎత్తున ఉద్యమాలు, నిరసనలు చేపడతామని, భగవంతుడిపై చేసే అనాదరణను హిందువులు ఏమాత్రం సహించరని అయన హెచ్చరించారు. ఇది కేవలం స్థానిక సమస్య కాదని, మత విశ్వాసాలపై అవమానకరమైన చర్యగా భావించి హిందూ సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేbవారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నడికుడ యాదగిరి, కార్పొరేటర్ రమాదేవి శ్రీనివాస్, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రేసు నరసింహా రెడ్డి, కొంతం ప్రకాష్ రెడ్డి, చెరుకుపల్లి వెంకట రెడ్డి, కుంటి భాస్కర్, తీగల సురేందర్ రెడ్డి, జి మల్లేష్, ప్రవీణ్ గౌడ్, అగ్రిసెట్టి సైదులు, సాయి కిరణ్, మల్లెల మహేందర్, పలువురు హిందూ బంధువులు పాల్గొన్నారు.

శ్రీరాముని చిత్రాన్ని చించిన…. మున్సిపల్ సిబ్బందిపై చర్య తీసుకోవాలి : బీజేపీ
Please follow and like us: