తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్
కొంపల్లి మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సతీష్ సాగర్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కొంపల్లి లోని జాతీయ రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ శుభ్రం చేసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ఔన్నత్యాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అయన రూపొందించిన రాజ్యాంగం వలనే ఈరోజు అన్ని కులాలు,మతాల వారు స్వేచ్ఛగా జీవిస్తున్నారని అన్నారు. అంబేద్కర్ విగ్రహం నుండి భారీగా హాజరైన కార్యకర్తలతో కలిసి కొంపల్లి గ్రామంలో మున్సిపల్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి పార్టీ దళిత కార్యకర్తలు మాణిక్య రావు,ఉమేష్ నివాసంలో అల్పాహారం చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి అధ్యక్షులు మల్లారెడ్డి, నాయకులు రాజిరెడ్డి,గిరివర్ధన్ రెడ్డి,విజ్ఞేశ్ చారి,భరత సింహా రెడ్డి,జనార్దన్ రెడ్డి,శివాజీ రాజు డివిజన్ అధ్యక్షులు జోగిని రాజు,విజయేందర్ రెడ్డి,మణికంఠ,పీసరి కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కొంపల్లిలో డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఈటల
Please follow and like us: