-
భవిష్యత్ అంతా భారతీయ జనతా పార్టీదే..
-
రాష్ట్రంలో కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొదలైంది
-
బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
తెలంగాణఅక్షరం-వీణవంక
ఏకాత్మత మానవత వాదం, అంత్యోదయ స్ఫూర్తితో బిజెపి 45 ఏళ్ల ప్రస్తానాన్ని విజయవంతంగా కొనసాగిస్తుందని దేశంలో ఏ పార్టీకి లేని విధానం, సిద్ధాంతం బిజెపికే ఉన్నాయని, ఆ పార్టీ అనుసరించిన విధానాలు మార్గాలతోనే ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగిన నెంబర్ 1 పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బిజెపి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గావ్ చలో /బస్తీ చేలో అభియాన్ ప్రోగ్రాం శనివారం రోజున వీణవంక మండలంలో పోతిరెడ్డిపల్లి గ్రామంలో జరిగింది. ఇట్టి ప్రోగ్రామ్ కు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దేశ హితం కోసం పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనన్నారు. ఏకాత్మత మానవతావాదం, అంత్యోదయ భావనతో ప్రేరణ పొందిన బిజెపి, ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో వివిధ రాష్ట్రాల్లోని సంకీర్ణ ప్రభుత్వాలతో కలిసి అంత్యోదయ మార్గంలో నిరంతరం ముందు కొనసాగుతుందన్నారు.
చిట్ట చివరి పేదల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా అంత్యోదయ విధానం తో ఏకత్మత మానవతావాదం ఆచరణగా, జాతీయ వాదమే సిద్ధాంతంగా కొనసాగుతున్న ఏకైక పార్టీ బిజెపి యే అన్నారు. 44 ఏళ్ల కఠోర సినిమా పోరాటం త్యాగాలతో పార్టీ స్థాయికి ఎదిగిందని, ఈ స్థాయికి పార్టీని తీసుకురావడానికి ఎంతోమంది మహానుభావులు విశేష కృషి చేశారని, వారు పార్టీకి చేసిన సేవలు మరువలేనివన్నారు. సబ్ కా సాత్ , సబ్ కా వికాస్ ధ్యేయంగా పనిచేస్తున్న మోడీ ప్రభుత్వ పాలనపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఎంతో విశ్వాసం ఉందని, అందుకే వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు.
తెలంగాణలో భవిష్యత్ అంతా బిజెపి దేనిని , రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బత్తి నరేష్ గౌడ్, జిల్లా కార్యదర్శి నరసింహ రాజు, పుప్పాల రఘు, సంపత్ రావు, గొడుగు వినోద్, ఉడుత కుమార్, కుమార్, డాక్టర్ సమ్మయ్య, దాట్ల వీరస్వామి, బూత్ అధ్యక్షుడు అరవింద్, ఓదెలు, కంకల సంతోష్, రాకేష్, శ్రీకాంత్, అశోక్, రమేష్, మహేందర్ పాల్గొన్నారు.