తెలంగాణఅక్షరం-వీణవంక
వీణవంక మండల చల్లూర్ జడ్పీ ఎస్ ఎస్ పాఠశాలలో చదివిన 1995-96 బ్యాచ్ ఎస్ఎస్సి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వ, ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూలమాలవేసి, శాలువా కప్పి విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో పూర్వ విద్యార్థులు ఆనాటి తీపి జ్ఞాపకాలను, గురువులు నేర్పిన క్రమశిక్షణను గుర్తుతెచ్చుకొని, స్నేహితులతో పంచుకున్నారు.
విద్యార్థి దశలో ఉపాధ్యాయుడు తన జ్ఞానాన్ని పంచడంతోనే, మనం ఈరోజు ఇంతటి విజ్ఞాన వంతులమయ్యామని, ఆనాటి గురువులకు పాదాభివందనాలు అంటూ గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పూర్వ విద్యార్థులు తమ జీవితంలో జరిగిన సంఘటనలను స్నేహితులతో పంచుకున్నారు. కష్టసుఖాలలో సహాయపడేవారే స్నేహితులని కొనియాడారు. అనంతరం సంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గురువులు మధన్ మోహన్ రావు, రాజిరెడ్డి, రామ్ కుమార్, సుధాకర్, కాశి విశ్వనాథ్, వెంకటేశ్వర్లు, శాంత కుమార్ సింగ్,పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.