- సింగల్ విండో అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి
తెలంగాణఅక్షరం-వీణవంక
రైతుల సంక్షేమానికి సహకార సంఘం కృషి చేస్తోందని, యాసంగి పంట తరుగు, కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని పీఏసీఎస్ చైర్మన్ మావురపు విజయభాస్కర్ రెడ్డి అన్నారు. మండలంలోని గంగారం, ఎల్బాక గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమానికి కట్టుబడి పని చేస్తోందని అన్నారు. రైతుల సన్నాలకు మద్దతు ధరతో పాటు బోనస్ రూ.500 చెల్లిస్తున్నట్లు చెప్పారు. కావున రైతులందరూ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు తాగునీరు వంటి సౌకర్యాలను కల్పించాలని, అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా టర్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.
కొనుగోళ్లలో కట్టింగ్, కోతలు లేకుండా చూడాలని, నిబంధనల ప్రకారం 48 గంటల్లోగా రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించేలా చూడాలని, వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మార్కెట్ డైరెక్టర్ సతీష్ గౌడ్, వైస్ చైర్మన్ గాజుల మేరీ శ్యామ్ సన్, డైరెక్టర్లు మధుసూదన్ రెడ్డి, గెల్లు మల్లయ్య యాదవ్, మాజీ ఉపసర్పంచ్ దేవయ్య, మాజీ ఎంపీటీసీ కాసం వీరారెడ్డి, నరహరి తిరుపతి రెడ్డి, సీఈవో ప్రకాష్ రెడ్డి, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.