తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్
సూరారంలో గొల్ల జాన్, పృథ్వి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మాజీ ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షులు కూన రాఘవేందర్ గౌడ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ఔన్నత్యాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అయన రూపొందించిన రాజ్యాంగం వలనే ఈరోజు అన్ని కులాలు,మతాల వారు స్వేచ్ఛగా జీవిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిల్లా, చిలుక శ్రీనివాస్ , 129 డివిజన్ సూరారం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us: