వరంగల్ లో మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం

తెలంగాణఅక్షరం-వరంగల్
వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన యువకుడు మూడేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పాప ఏడవడంతో గమనించిన స్థానికులు రంజాన్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

స్థానికుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ‌కు చెందిన రంజాన్ కూలీ పనుల కోసం గిర్మాజీ పేటకు వచ్చి అద్దెకు ఉంటున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పక్కనే ఉన్న మూడేళ్ల బాలికపై అతడి కన్ను పడింది. ఎవరూ లేని సమయంలో ఆ బాలికపై లైంగిదాడికి యత్నించారు.

యువకుడు చేస్తున్న పనితో బాలిక భయందోళనకు గురై ఏడవడంతో స్థానికులు అక్కడకు చేరుకుని అతడిని పట్టుకొని చితకబాదారు. అనంతరం ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై ఫోక్సో, అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Please follow and like us:

Check Also

చల్లూరులో అ‘పూర్వ’ సమ్మేళనం

తెలంగాణఅక్షరం-వీణవంక వీణవంక మండల చల్లూర్ జడ్పీ ఎస్ ఎస్ పాఠశాలలో చదివిన 1995-96 బ్యాచ్‌ ఎస్ఎస్సి చదివిన పూర్వ విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *