- సగరులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలి
- తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర
తెలంగాణ అక్షరం-హన్మకొండ
కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ పదవి సగరులకే కేటాయించాలని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హన్మకొండ పట్టణంలోని కేయూ ఎదురుగా ఉన్న ఎన్‌ఎస్ బంకెట్ హాలులో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగాయి. ఈ సమావేశాలు హన్మకొండ జిల్లా సగర సంఘం, హన్మకొండ సగర సంక్షేమ సంఘం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా ఈ సందర్భంగా సగర కులగురువైన భగీరథమహర్షి ఫొటో వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం శేఖర్ సగర మాట్లాడుతూ సగరులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను రాజకీయంగా ఎదిగేందుకు వినియోగించుకోవాలని, వీలైనంత ఎక్కువగా గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. సగరులు నివాసం ఉన్న ప్రతీ చోట రిజర్వేషన్‌ను బట్టి తప్పనిసరిగా ఎక్కవ సంఖ్యలో బరిలో నిలపాలని చెప్పారు. అలాగే కులగురువైన భగీరథ జయంతిని ఘనంగా నిర్వహించాలని, భగీరథ మహర్షి విగ్రహాలను అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసేలా కృషి చేయాలని పేర్కొన్నారు.
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలని సూచించారు. కాలపరిమితి పూర్తైన జిల్లాల్లో నూతన కమిటీలు వేసేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. యాదాద్రి లో నిర్మిస్తున్న అన్నదాన సత్రానికి ప్రతీ సగరుడు తనవంతు సాయం చేయాలని, ఇందుకోసం విరివిగా విరాళాలు సేకరించాలని తీర్మానించారు. ఇటీవల శ్రీ రామ నవమి సందర్భంగా భాగ్య నగర్ నుండి భద్రాచలం వరకు పాదయాత్ర చేసి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్ర్తాలు అందజేసినందుకు తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు మర్క సురేష్ సగర ను అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధులకు భ్రదకాళీ అమ్మవారి చిత్రపటం అందజేసి సత్కరించారు. సమావేశానికి కుల సంఘానికి సేవ చేసి అసువులు బాసిన సీత భద్రయ్యతో పాటు పలువురికి రెండు నిముషాలు మౌనం పాటించి సానుభూతి ప్రకటించారు.
సగరుల కు అన్ని విధాలుగా అండగా ఉంటా : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
సగరులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. సగర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రానున్న ఎన్నికలల్లో సగరులకు సీట్లు ఇచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో అత్యధికంగా నిధులు కేటాయిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సగర సంఘం నాయకులు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి భ్రదకాళీ అమ్మవారి చిత్రపటం అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సగర సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముత్యాల హరికిషన్ సగర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, రాష్ట్ర కోశాధికారి వడ్లకొండ కుమారస్వామి సగర, మహిళా విభాగం రాష్ట్ర అధక్షురాలు గాండ్ల స్రవంతి సగర, జిల్లా అధ్యక్షుడు నలుబాల సతీష్ సగర, ప్రధాన కార్యదర్శి కుర్మిండ్ల కుమారస్వామి సగర, కోశాధికారి మంగునూరి రఘు సగర, కార్పొరేటర్ గుంటి రజిత శ్రీనివాస్ సగర, హన్మకొండ సగర సంక్షేమ సంఘం ట్రస్ట్ అధ్యక్షుడు సీత కమలాకర్ రావు సగర, మాజీ కార్పొరేటర్లు తాడిశెట్టి విద్యాసాగర్, వీరగంటి రవీందర్ సగర, సగర సంఘం యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొడిపాక గణేష్ సగర, నాయకులు సీత రమేష్ సగర, కుర్మిండ్ల సదానందం సగర, గుజ్జరి అరుణ్ సగర తదితరులు పాల్గొన్నారు.