తెలంగాణ అక్షరం-హన్మకొండ
ఇంటర్మీడియట్ ఫలితాలలో ఏకశిలా విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారని విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ డా. గౌరు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ నిరంతర యాజమాన్య పర్యవేక్షనతో , పటిష్టమైన ప్రణాళిక , సమిష్టి కృషి , సహజ నైపుణ్యాన్నీ వెలికితీసే ప్రేరణ తరగతులు , ఒత్తిడి లేని విద్య కోసం ప్రముఖ వ్యక్తులతో అవగాహనా సదస్సులతో పాటు, అత్యుత్తమమైన బోధనతో, క్రమశిక్షణతో కూడిన విద్యావిధానం తో ఇంటర్ ఫలితాలలో అన్ని విభాగాలలో రాష్ర్ట స్థాయిలో మొదటి స్థానం సాదిస్తూ, ఓరుగల్లులో తిరుగులేని విద్యాసంస్థలు గా మా ఏకశిలా విద్యాసంస్థలు నిలుస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను , తల్లిదండ్రులను మరియు ఉపాద్యాయులను అభినందించారు.
ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీలో పి.కావ్య 470 మా ర్కులకు 468, పి.సాయిగణేష్ 466, డి.సాయిరాజ్ 466, ఎం.గణేష్ 466 మార్కులు సాధించారు. బైపీసీలో టి. లాహిత 440 మార్కులకు 437, పి.అర్చన 437, పి.హాసిక 436, ఇ.అర్చన 436 మార్కులు సా ధించారు. సీఈసీలో ఎండీ.సానియా 500 మార్కులకు 488, ఎ.రష్మిక 487 సాధించగా ఎంఈసీలో టి.అశ్విత 495 మార్కులు సాధించారు. సెకండియర్ ఎంపీసీలో జే.ప్రతీశ్వర్ 1000 మార్కులకు 993, ఇ.మనోజ్ఞ 990 మార్కులు, బైపీసీలో డి.లక్ష్మీవైష్ణవి 990, సీఈసీలో సుమైయ తన్వీర్ 974 మార్కులతో విజయకేతనం ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఎం.జితేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్స్ సుధాకర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, రాజిరెడ్డి, బోధనా సిబ్బంది పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్ ఫలితాలలో ఏకశిలా విద్యార్థుల విజయకేతనం
Please follow and like us: