తెలంగాణ అక్షరం-కుత్బుల్లాపూర్ :
అమాయకులైన హిందూ పర్యాటకులపై దాడి చేసి ప్రజలు ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదులపై కేంద్రం త్వరలోనే ప్రతీకారం తీర్చుకోవాలని కొంపల్లి మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సతీష్ సాగర్ పేర్కొన్నారు. 25 మందికి పైగా బలిగొన్న ఉగ్రవాదానికి భారతదేశం ఉక్కు పాదం రుచి చూపించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ లోని బైనారస్ లోయను సందర్శించడానికి వచ్చిన పర్యాటకుల పై హిందువులనే లక్ష్యంగా పెట్టుకుని ఉగ్రవాదులు జరిపిన దాడిలో 25 మందికి పైగా పర్యాటకులు మృతి చెందడం బాధాకరమైన విషయం అన్నారు. కేంద్ర ప్రభుత్వం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించేల చర్యలు చేపట్టాలని కోరారు.

ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య
Please follow and like us: