శ్రీ గాయత్రి స్కూల్ ఆధ్వర్యంలో నల్ల దుస్తులతో నిరసన
తెలంగాణ అక్షరం – బాలాపూర్ (టి లక్ష్మణ్):
అమాయకులైన హిందూ పర్యాటకులపై దాడి చేసిన ఉగ్ర వాదుల చర్యకు నిరసనగా బాలాపూర్ మండల పరిధిలోని బడంగ్ పేటలో శనివారం శ్రీ గాయత్రి స్కూల్ ఆధ్వర్యంలో కొవ్వతుల ర్యాలీ నిర్వహించారు. నల్లని దుస్తులు ధరించి కొవ్వొత్తులు చేతిలో పట్టుకుని ఉగ్రవాదుల దుశ్చర్య ను ఖండిస్తూ నినాదాలు చేస్తూ ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా
శ్రీ గాయత్రి స్కూల్ కరస్పాండెంట్ విజయ ప్రసాద్ మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ లోని బైనారస్ లోయను సందర్శించ డానికి వచ్చిన పర్యాటకుల పై హిందువులనే లక్ష్యంగా పె ట్టుకుని ఉగ్రవాదులు జరిపిన దాడిలో 25 మందికి పైగా పర్యాటకులు మృతి చెందడం బాధాకరమైన విషయం అ న్నారు. కేంద్ర ప్రభుత్వం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను క ఠినంగా శిక్షించేల చర్యలు చేపట్టాలని కోరారు. అమాయకులపై దాడి మానవతావాన్ని మంట కలిపిందని, శాంతి స్థాపనకు జరుగుతున్న ప్రయత్నంలకు వ్యతిరేకంగా ఉగ్రవాదులు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కేంద్రం ఉగ్రవాదులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన కుటుంబాలకు నివాళులు అర్పించారు.

ఉగ్రవాదుల చర్యకు నిరసన కొవ్వొత్తుల ర్యాలీ
Please follow and like us: