తెలంగాణఅక్షరం-వీణవంక
మండలంలోని మానేరు వాగునుండి అక్రమంగా తరలిస్తున్నరెండు ఇసుక ట్రాక్టర్లను శనివారం పట్టుకున్నట్లు వీణవంక ఎస్సై తోట తిరుపతి తెలిపారు. మల్లన్నపల్లి గ్రామంలో శనివారం ఉదయం పెట్రోలింగ్ చేస్తుండగా SRSP కెనాల్ వద్ద రెండు ట్రాక్టర్లు ఇసుక లోడుతో వస్తుండగా పోలీసులు ఆపి వాటిని పరిశీలించారు. వారి వద్ద సరైన పత్రాలు లేకుండా కోర్కల్ మానేరు నుండి ఇసుకను అక్రమంగా తరలించి హుజురాబాద్‌లో అమ్మేందుకు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు.
దీంతో మండలంలోని కోర్కల్ చెందిన రెండు ట్రాక్టర్లకు సంబంధించిన ఓనరు కం డ్రైవర్లైన కోర్కల్ కు చెందిన సుద్దాల దేవుడులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుకను మానేరు తీరం నుండి అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.