తెలంగాణఅక్షరం-హన్మకొండ
రాష్ర్ట ప్రభుత్వం బుధవారం ప్రకటించిన పదో తరగతి పరీక్షా ఫలితాలల్లో ఏకశిల విద్యాసంస్థల హావా కొనసాగింది. 600 మార్కులకు గాను వి కృతిక 582 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. అలాగే డీ సహస్ర్త 578మార్కులతో ద్వితీయ, జీ సాకేత్ కుమార్ 575 మార్కులతో తృతి స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ప్రకటించడానికి చాలా గర్వంగా, ఆనందంగా ఉందని ప్రశంసించారు. ఫలితాలతో పాటు విద్య నైపుణ్యా సాంప్రదాయాన్ని నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు.
విద్యార్థుల కృషి, క్రమశిక్షణ, అంకిత భావం తో సహా అత్యుత్తమ ఉపాధ్యాయ బృందం ఎల్లవేళలా మద్దతు ఇచ్చే తల్లిదండ్రుల సహకారంతో ఈ అద్భుతమైన విద్యా ఫలితాలను సాధించారని తెలిపారు. ఈ విజయం మా ఉపాధ్యాయుల అవిశ్రాంత నిబద్ధతకు నిదర్శనం అని వారు మా విద్యార్థులకు ప్రతీ అడుగులోనూ మార్గ నిర్దేశం చేసి మార్గదర్శకత్వం వహించి స్ఫూర్తినిచ్చారని తెలిపారు. ఈ ఫలితాలు మమ్మల్ని ఇకనుండి విద్య సాధనలో ఇంకా ఉన్నత ప్రమాణాల కోసం కృషి చేయడానికి ఉత్తేజపరిచిందని తెలిపారు.
తల్లి తండ్రుల కలలను నేరవేరుస్త్సు విద్యార్థులకు బంగారు భవిశ్యత్ కు మా ఏకశిలా విద్య సంస్థలు ఎల్లపుడు ముందు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను తిరుపతిరెడ్డి అభినందించారు. ఈ సభలో కార్యక్రమంలో ఏకశిల విద్యాసంస్థల బాధ్యులు బేతి కొండల్ రెడ్డి, గౌరు సువిజా రెడ్డి, ముచ్చా జితేందర్ రెడ్డి, సీహెచ్ దినేష్ రెడ్డి, ప్రిన్సిపల్స్ బేతి శైలజా రెడ్డి, ముచ్చా స్వప్న రెడ్డి, ఎండీ బాబా, సీహెచ్ పాండురంగం తదితరులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.