తెలంగాణ అక్షరం-వీణవంక
మే4న సగరుల కుల గురువైన భగీరథ మహర్షీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు సగర, జిల్లా కోశాధికారి కాటిపెల్లి కుమారస్వామి సగర కోరారు. జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా సగరులు ఉన్న అన్ని గ్రామాల్లో భగీరథుడి జయంతి వేడుకలను ఉత్సవంలా నిర్వహించాలని కోరారు. రాష్ర్ట ప్రభుత్వం భగీరథ మహర్షీ జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించుకునేందుకు రూ.6లక్షలు విడుదల చేసినందుకు ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
Please follow and like us: