మహిళలు పట్టుదలతో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి

  • అవకాశాలను అందిపుచ్చుకోవాలి
  • అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలవాలి
  • గ్రామాల్లో సమస్యల పరిష్కరానికి ప్రత్యేక కృషి
  • లక్ష్యసాధనకు నిరంతరం శ్రమించాలి
  • జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
  • డెమొక్రటిక్ సంఘ సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని వీ కన్వెన్షన్ హాల్ లో గ్రామీణ మహిళ నాయకత్వ కార్యక్రమం కింద మహిళా సంఘం వార్షిక సమావేశం
  • హాజరైన ప్రముఖ సినీ నటి రెజీనా కసాండ్రా
  • పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు

తెలంగాణఅక్షరం-కరీంనగర్‌
సహనానికి.. ఓర్పుకు మహిళలు మారుపేరూ అని, క్రమశిక్షణ పట్టుదల కృషి కటోర శ్రమతో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. డెమొక్రటిక్ సంఘ సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని బొమ్మకల్ బైపాస్ రోడ్ లో ఉన్న వీ కన్వెన్షన్ హాల్ లో ఆదివారం గ్రామీణ మహిళ నాయకత్వ కార్యక్రమం కింద మహిళా సంఘం వార్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రముఖ నటి డెమోక్రటిక్ సంఘ సహ వ్యవస్థాపకురాలు రెజీనా కాసాండ్రా, సంస్థ వ్యవస్థాపకుడు, సామాజిక కార్యకర్త ఎంఆర్ఎస్కే చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడారు.

మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో ముందుండాలని పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న మహిళలు సమస్యలపై చక్కగా మాట్లాడాలని, వారు చెప్పిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలనీ, అప్పుడే నాయకులుగా రాణిస్తారని తెలిపారు. లక్ష్యసాధనకు నిరంతరం శ్రమించాలని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలతో ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. గ్రామాల్లో రోడ్లు నిర్మాణానికి, తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తానని చెప్పారు.

అదేవిధంగా గ్రామాల్లో అనాధికారికంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల్లో ఆర్టీసీ బస్సుల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని, విద్యార్థులు మహిళలు వృద్ధుల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. కోతులు, కుక్కలకు మానవులతో అనుబంధం ఎక్కువగా ఉంటుందని వాటిపై దాడులు చేయకుండా సంరక్షించు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జిల్లాలోని మహిళా మణులు అందరూ మహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మహిళలు మరింత చైతన్యవంతులు కావాలని, పురుషుల ప్రోత్సాహం లేకుండానే అన్ని రంగాల్లో ముందుకెళ్లేలా కృషి చేయాలని, ఆ దిశగా ప్రస్తుతం ముందడుగు పడుతున్నదని పేర్కొన్నారు. మహిళలు చైతన్యవంతులైనప్పుడే సమాజం చైతన్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం మహిళలు కృషి చేయాలని, ప్రైవేట్ పాఠశాలల పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని తద్వారా ప్రభుత్వ పాఠశాలను ఆదరించాలని సూచించారు. ప్రజాస్వామ్య విలువలను, మహిళా నాయకత్వాన్ని పెంపొందించడానికి లాభాపేక్షలేకుండా డెమోక్రటిక్ సంఘ సంస్థ కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

గ్రామాల్లో ఆ సంస్థ గ్రామాల్లో మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తూ మహిళల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేయడం శుభ పరిణామమని తెలిపారు. డెమొక్రటిక్ సంఘ సంస్థ ఏర్పాటు చేసిన మహిళా సంఘాలకు సైతం ప్రభుత్వం తరఫున తోడ్పాటు అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వీరికి సైతం స్కూల్ యూనిఫామ్ లు కుట్టే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.
ప్రముఖ నటి డెమోక్రటిక్ డెమొక్రటిక్ సంఘ సహ వ్యవస్థాపకురాలు రెజీనా కాసాండ్రా, సంస్థ వ్యవస్థాపకుడు ఎంఆర్ఎస్కే చైతన్య మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలు అంటే స్టేజి మీద మాట్లాడం కాదన్నారు. ప్రజాస్వామ్యంలో అన్యాయాన్ని ఎదిరించడం తోపాటు సమస్యలపై గల మెత్తడమే లక్ష్యంగా మహిళలు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. తమ సంఘం ఆధ్వర్యంలో గ్రామాల్లో మహిళా సంఘాలు ఏర్పాటు చేస్తున్నామని వారిలో చైతన్య నింపేందుకు ప్రత్యేక కార్యక్రమాల రూపొందిస్తున్నామని తెలిపారు. మహిళలకు నాయకత్వ లక్షణాలు పెంపొందించే దిశగా తమ సంస్థ ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు.

మహిళ నాయకత్వం మార్పుకు మార్గదర్శనమని పేర్కొన్నారు. మహిళలందరికీ రాజ్యాంగ ప్రజాస్వామ్య హక్కులను తెలపడంతో పాటు వారినీ అన్ని రంగాల్లో నిష్ణాతులను చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన దాదాపు 25 మంది మహిళా సంఘాల ప్రతినిధులు వివిధ సమస్యలు పలు అంశాలపై మాట్లాడారు. మహిళలు విన్నవించిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా వారు సంస్థ ఫౌండర్ చైతన్య సినీనటి రెజీనా కసాండ్రా తదితరులు జిల్లా కలెక్టర్ ను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో డెమోక్రటిక్ సంఘ ట్రస్ట్ ప్రియ రాజీవ్, ప్రతినిధి షేక్ ఆయుబ్ అడిషనల్ డి ఆర్ డిఓ సునీత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Please follow and like us:

Check Also

పదో తరగతి ఫలితాలలో ఏకశిల విద్యాసంస్థల హావా..

తెలంగాణఅక్షరం-హన్మకొండ రాష్ర్ట ప్రభుత్వం బుధవారం ప్రకటించిన పదో తరగతి పరీక్షా ఫలితాలల్లో ఏకశిల విద్యాసంస్థల హావా కొనసాగింది. 600 మార్కులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *