మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి
కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు సరికాదు
తెలంగాణ ప్రజా ఫ్రంట్ కరీంనగర్ జిల్లా కమిటీ
తెలంగాణ అక్షరం-వీణవంక
మావోయిస్టులపై అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని. తెలంగాణ ప్రజా ఫ్రంట్ కరీంనగర్ జిల్లా ప్రధానకార్యదర్శి ఆయిందాల అంజన్న డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా,ప్రజాస్వామ్యనికి వ్యతిరేకంగా అమాయకపు గిరిజనులను చంపుతున్నారని ఆరోపించారు.మావోయిస్టులతో చర్చలు జరిపేది లేదని మాట్లాడుతున్న బండి సంజయ్ వ్యాఖ్యలు హాస్యస్పదంగా ఉన్నాయని ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు.మావోయిస్టులు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారని కర్రెగుట్టల నుండి పోలీసు బలగాలను వెనక్కి రప్పించి శాంతి చర్చలు జరపాలని ఆదివాసీ ప్రాణాల హననాన్ని కాపాడాలని వారు కోరారు.