తెలంగాణఅక్షరం-వీణవంక
మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) వీరాభిమాని ఆవునూరి జయరాజ్ అనారోగ్యంతో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్ కు ఆవునూరి జయరాజ్ వీరాభిమానిగా ఉండేవాడు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందునుండే జయరాజ్ అభిమానం పెంచుకున్నాడు. కాగా తెలుగుదేశం పార్టీ స్థాపించగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేవాడు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చల్లూరు నుండి గోదావరిఖనికి వలస వెళ్లిన జయరాజ్ ఆక్కడ పార్టీ బలోపేతం కోసం తీవ్రమైన కృషి చేశాడు. కాగా ఆ సమయంలో జయరాజ్ కు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శిగా పార్టీ బాధ్యత అప్పగించింది. ఆయన మృతి పట్ల పలువురు నాటి తెలుగుదేశం కార్యకర్తలు సంతాపం ప్రకటించారు.

ఎన్టీఆర్ వీరాభిమాని ఆవునూరి జయరాజ్ మృతి
Please follow and like us: