- ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు
- అభినందించిన చైర్మన్ వీ నరేందర్‌రెడ్డి
తెలంగాణ అక్షరం-కరీంనగర్
ఎప్‌సెట్ -2025 ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్‌లోని వావిలాలపల్లిలోగల టైనిటాట్స్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. కళాశాలకు చెందిన బీ వర్షిత్ 203, అదిబా ఫిర్థోజ్ 206, ఎం ప్రణీత్ 250, కే మనోజ్‌కుమార్ 286, బీ శ్రీనిత్య 296, జీ కౌషల్ ప్రియ 339, జీ రిషిత 438, జే అనూష 447, కే అర్చన 485, ఎండీ అబ్దుల్ జిషాన్ 551, సీహెచ్ శ్రీనిధి 567, కే వీరేంద్రప్రసాద్ 572, ఎం రోహిత్‌రెడ్డి 606, అబు ఉమేర్ 614, హాస్నమహవిష్ 639, పీ శ్రీనిత్యరెడ్డి 704, కే శ్రీరామ్‌చరణ్ 732, కే హాసిని 735, రాంసకోరిన్ 738, డీ సుమగ్జయ 752, ఎల్ శరణ్య 762, జీ సింధు 763, బీ అభిజ్ఞ 801, జే వామిక 807, వీ అక్షయ్ 831, డీ హరిశంకర్ 838, బీ భువనకృతి 839, ఏ శశిప్రితమ్ 853, కే సాయిశ్రేయాన్‌రెడ్డి 908, వీ హృషికేశ్ 920, మహ్మద్ సప్రోజ్ 927, కే గాయత్రి 992, ఏ శ్రీనిజరెడ్డి 997 వ ర్యాంకు సాధించారన్నారు. వెయ్యిలోపు 33 మంది, 2000 వరకు 72 మంది, 3000లోపు 105 మంది, 5000లోపు 192 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించి అల్ఫోర్ కీర్తి ప్రతిష్టలను దశదిశలా చాటారని చెప్పారు. తకువ మంది విద్యార్థులతో అత్యధిక అత్యద్భుత ర్యాంకులు సాధించడం అల్ఫోర్స్‌కు మాత్రమే సాధ్యమని ఈ ఫలితాలు తెలియజేశాయన్నారు. ఇదే క్రమంలో ఇటీవల ప్రకటించిన ఐఐటీ ఫలితాల్లో ప్రతిభ కనబర్చి 461 మంది అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారన్నారు. రానున్న అడ్వాన్స్‌డ్ ఫలితాల్లోనూ తమ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, నీట్ ఫలితాల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తారని చెప్పారు.