తెలంగాణ అక్షరం-కరీంనగర్
ఎప్‌సెట్ ఫలితాల్లో శ్రీచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభచూపినట్లు విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాశాల ప్రాంగణంలో విద్యార్థులను ఆయన అభినందించారు. గోకులకొండ వైష్ణవి 810 ర్యాంకు, బీ మనోఘ్న 968, బీ సాత్విక్ 1142, పీ స్ఫూర్తిశ్రీ 1527, బీ శ్రావణి 1803, పీ బ్లెసీ సుసన్ 2106, పీ చందన 2165, పీ భరత్ రెడ్డి 2815, పీ అజితేష్ 3016, కే అనూహ్య 3503, వీ ప్రవీణ్ 3623, డీ రిషి 3996, జీ అర్చన 4171, ఆర్ శ్రీయాన్ 4246, వీ శివాణి 4570, బీ స్రవంతి 4957 ఇలా 16 మంది 5 వేలలోపు ర్యాంకులు సాధించారని, 10 వేల లోపు 51 మంది విద్యార్థులు సాధించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయ సాధనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పడిన అధ్యాపకులను అభినందించారు. ఇక్కడ శ్రీ చైతన్య కళాశాలల డైరెక్టర్ కర్ర సరేందర్ రెడ్డి, దీన్ జగన్ మోహన్ రెడ్డి, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఏజీఎం శ్రీనివాస్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎప్‌సెట్ -2025లో శ్రీ చైతన్య ఉత్తమ ప్రతిభ
Please follow and like us: