ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్లాట్ బుకింగ్‌ విధానం ప్రారంభం

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రిజిస్ట్రార్‌ బీ ప్రవీణ్‌కుమార్‌

పెద్దపల్లి, మే12: పెద్దపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో ఆస్తులు/ప్లాట్స్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోనుటకు స్లాట్‌ బుకింగ్‌ విధానం ప్రవేశ పెట్టినట్లు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రిజిస్ట్రార్‌ బీ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. కార్యాలయంలో స్లాట్‌ బుకింగ్‌ విధానం, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలోని ఆస్తులు/ ప్లాట్స్​‍ను ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయటకు రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ చర్యలు చేపట్టనట్లు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 144 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా, పైలెట్‌ ప్రాజెక్ట్‍ కింద 22 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఎంపిక చేయగా, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రామగుండం, జగిత్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఎంపిక చేశారని తెలిపారు. రెండో ధపాలో 25 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్లాబ్‌ బుకింగ్‌ విధానం ప్రవేశ పెట్టగా, అందులో పెద్దపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఒక్కటిని వెల్లడించారు. ఈ మేరకు సోమవారం స్లాట్‌ బకింగ్‌ చేసుకున్న వారికి 10 -15 నిమిషాల కాల వ్యవధిలో రిజిస్ట్రేషన్‌, మ్యూటెషన్‌ పూర్తి చేసి దస్తావేజులు అందజేశామని తెలిపారు. ఒక రోజుకు 48 స్లాట్‌ అందుబాటులో ఉంటాయని, స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవటానికి registration.telangana.gov.in వెబ్‌ సైట్‌ సందర్శించాలని సూచించారు.

స్లాట్‌ బుకింగ్‌ కోసం బోకర్లను ఆశ్రయించవల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కంప్యూటర్‌పై అవగాహన ఉన్న వారు ఇంటి వద్ద నుంచే స్లాటింగ్‌ బుకింగ్‌ చేసుకోవచ్చుని సూచించారు. ఇంతకు ముందు రిజిస్ట్రేషన్‌ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేదని, డాక్యుమెంట్‌ తీసుకోవాటానికి రెండు, మూడు రోజులు పట్టేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని కేవలం 10 -15 నిమిషాలలో చేతికి డాక్యుమెంట్‌ వస్తుందని చెప్పారు. మ్యూటేషన్‌ కోసం మున్సిపల్‌/ జీపీ కార్యాలయ చూట్టు తిరగాల్సిన పని లేదన్నారు. పారదర్శకంగా, పర్ఫెక్ట్‍గా సేవలు పొందవచ్చునని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ డీ అశోక్‌, జూనియర్‌ అసిటెంట్లు పీ వేణు, రాజశేఖర్‌ రెడ్డి, అభిలాష్‌, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *