ఆకట్టుకున్న ఉమ్మడి జిల్లా చదరంగం పోటీలు

  • విజేతలకు బహుమతులు అందజేత

తెలంగాణఅక్షరం-కరీంనగర్

కరీంనగర్ లోని జ్యోతి నగర్ జీనియస్ చెస్ అకాడమీ లో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓపెన్ మరియు అండర్ 15 విభాగంలో నిర్వహించిన చదరంగం పోటీలకు విశేష స్పందన లభించింది. దాదాపు 100 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ రమణ మూర్తి మాట్లాడుతూ చదరంగంతో మేధాశక్తి ఏకాగ్రత పెరుగుతుందన్నారు. జీనియస్ చెస్ అకాడమీ వ్యవస్థాపకులు కంకటి కనకయ్య మాట్లాడుతూ చదరంగం క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసే అందుకే ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని, పాల్గొన్న గెలుపొందిన క్రీడాకారులకు నగదు బహుమతితో పాటు మెమొంటోలు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూరో ఫిజీషియన్ డాక్టర్ వెంకట్ ,జీనియస్ చెస్ అకాడమీ డైరెక్టర్ కంకటి అనూప్ కుమార్, సృజన్ కుమార్, తాటిపల్లి సతీష్ బాబు, చీఫ్ ఆర్బిటర్ అరుణ్, ఆర్బిటర్స్ రేవిక్ , నితిన్ , ప్రభుచంద్ర వరుణ్ ,అభిరామ్ , శ్రీ నిజ , స్వాతి, చదరంగం క్రీడాకారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *