జిల్లా సమగ్రాభివృద్ధికోసం సీపీఐ రాజీలేని పోరాటం

  • హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి

హసన్ పర్తి : జిల్లా సమగ్రాభివృద్ధికై సిపిఐ రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందని, హసన్ పర్తి మండల కేంద్రంలో ఈ నెల 26, 27 తేదీల్లో జరిగే సిపిఐ జిల్లా 2వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి పిలుపునిచ్చారు. సోమవారం హాసన్ పర్తి మండలకేంద్రంలో నిర్వహించినవిలేకరుల సమావేశంలో సిపిఐ హనుమకొండ జిల్లా 2వ మహాసభల వాల్ పోస్టర్లను సిపిఐ నాయకులతో ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగాహాజరైన జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పాలక పార్టీలు విఫలంఅయ్యాయని విమర్శించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలంఅయిందని, దేశాన్ని కార్పొరేట్ లకు తాకట్టు పెట్టి దివాళా తీయించిందని అన్నారు. మోడీ నమ్మిన బంటు ఆదానీకి ప్రభుత్వ రంగ సంస్థలను దోచి పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.విపక్ష పార్టీల నాయకులపై సిబిఐ,ఈడి లను ప్రయోగిస్తున్న మోడీ ప్రభుత్వం ఆదానీపై ఎందుకు ప్రయోగించడం లేదని ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రంపై మోడీ ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ అని,విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి,ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని అన్యాయం చేసారని అన్నారు.

రాష్ట్రంలో రైతులకు రెండులక్షలరైతు రుణమాఫీ పూర్తిగా ఇవ్వాలని, ఇందిరమ్మఇండ్ల పంపిణీ పారదర్శకంగా అర్హులైనపేదలకు అందించాలని,జిల్లాలో అసంపూర్తిగా ఉన్నా దేవాదుల ప్రాజెక్టును పూర్తిగా నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లాల పునర్విభజన చేసిన తర్వాత ఏర్పడ్డ హనుమకొండ జిల్లా పట్టణ ప్రాంత జిల్లాగా విలసిల్లుతొందని, గ్రామీణ ప్రాంతం ఉన్నప్పటికీ పట్టణ జనాభానే అధికంగా ఉందని,హైద్రాబాద్ తర్వాత పెద్దనగరంగాఉందని, పారిశ్రామికంగాపాలకులుఅనేక వాగ్దానాలు చేసినా అమలుకు నోచుకోలేదని అవేదనవ్యక్తం చేశారు.జిల్లాలో నిరుద్యోగం బాగా పెరుగుతున్నదని,అటు వ్యవసాయకంగా,ఇటూ పారిశ్రామికంగాజిల్లాప్రజల అవసరాల్ని  దృష్టి యుందుంచుకొని పాలకులు పరిపాలనచేయట్లేదని అన్నారు.

జిల్లాలోని రైతాంగానికి సాగునీరందించేఎస్.ఆర్.ఎస్.పి,దేవాదుల కాలువ సమస్యలపైఈ మధ్యకాలంలో సిపిఐ పోరాటం చేసిన ఫలితంగా రెండవపంటకు కూడానీళ్ళు ఇవ్వటానికి అధికార యంత్రాంగం ముందుకువచ్చిందని తెలిపారు.ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం జరిగిన పోరాటంలో సిపిఐదే ఉమ్మడి జిల్లాలో అగ్రగామి పాత్ర అని, గ్రామాల్లో ఉపాధి హామీ, పట్టణల్లోమున్సిపల్ వర్కర్స్, సంఘటిత, అసంఘటిత కార్మికుల సమస్యలపై, నిలువనీడలేని పేదలకు ఇండ్ల స్థలాల కోసం గుడిసెల పోరాటాలు నడిపింది సిపిఐ అని, జిల్లా సమగ్ర అభివృద్ధికై సిపిఐ రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందని వారు అన్నారు.

ఈ నెల 26, 27 తేదీలలో హసన్ పర్తి మండల కేంద్రంలో సిపిఐ జిల్లా 2వ మహాసభలు జరగబోతున్నాయని, జిల్లాలో నెలకొని ఉన్న ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఈ మహాసభలు వేదిక కానున్నాయని, ఈ మహాసభల్లో మొదటి రోజు మే 26న ప్రజా ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుందని, ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు లు హాజరు కానున్నారని తెలిపారు.

ఈ మహాసభల్లో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, సిపిఐ సీనియర్ నాయకులు మోతె. లింగారెడ్డి, నేదునూరి. రాజమౌళి, రాష్ట్ర సమితి సభ్యులు నద్దునూరి అశోక్, స్టాలిన్, జిల్లా నాయకులు ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, మునిగాల బిక్షపతి, బత్తిని సదానందం, కొట్టేపాక.రవి, మాలోత్. శంకర్, కొట్టే.వెంకటేష్, దామెర,సుదర్శన్,మండల కార్యదర్శి మెట్టు.శ్యామ్ సుందర్ రెడ్డి, నాయకులువస్కుల.భరత్ తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

Check Also

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

తెలంగాణ అక్షరం – కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *